నేడు (నవంబర్ 23 ) కృష్ణా బోర్డును కలవనున్న బీఆర్ఎస్ నేతలు

నేడు (నవంబర్ 23 ) కృష్ణా బోర్డును కలవనున్న బీఆర్ఎస్ నేతలు
  • హైదరాబాద్​ తాగునీళ్లు, పల్నాడు ప్రాజెక్టుపై వినతిపత్రం  

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు త్రీమెంబర్​ కమిటీ మీటింగ్​నేపథ్యంలో.. సోమవారం బీఆర్ఎస్​నేతలు బోర్డు మెంబర్​సెక్రటరీ సతీశ్​కాంబోజ్​ను కలవనున్నారు. హైదరాబాద్  తాగునీటి అవసరాలకు కీలకమైన నాగార్జునసాగర్ రిజర్వాయర్​లో నీటి నిల్వలను పరిరక్షించడంతో పాటు, ఏపీ ప్రభుత్వం పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో చేపడుతున్న సొరంగ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ  వినతిపత్రం ఇవ్వనున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో కూడిన సుమారు పది మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీ ప్రాజెక్ట్​విషయంలో అనుమతులు, నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు, వాటి ప్రభావంపై బోర్డు సమగ్రంగా పరిశీలించాలని కోరనున్నారు. ఏపీ చేపడుతున్న నిర్మాణాల వల్ల తెలంగాణ నీటి హక్కులకు, తాగునీటి ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.